గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:57 IST)

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి స్పైస్ జెట్ విమాన సేవలు రద్దు

ఏపీలో స్పైస్ జెట్ విమాన సేవలను రద్దు చేశారు. విజయవాడ గ‌న్న‌వ‌రం అంతర్జాతీయయ విమానాశ్రయం నుంచి న‌డుస్తున్న స్పైస్ జెట్ విమానాల‌కు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేక‌పోవ‌డంతో స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. 
 
ఈ సర్వీసులను వచ్చే అక్టోబరు నుంచి నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించింది. నేటి నుంచే సర్వీసుల రద్దు అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వీసుల రద్దు విషయంపై గన్నవరం విమానాశ్రయం అధికారులకు స్పైస్ జెట్ యాజమాన్యం సమాచారం అందించింది. 
 
విజయవాడ నుంచి స్పైస్‌జెట్‌ కేవలం ఒక్క నగరానికి మాత్రమే సర్వీసులు నడుపుతుంది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తూ వచ్చింది.