సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (19:41 IST)

ఏపీ ప్రజలకు దిమ్మితిరిగే షాక్: ప్రతి నెలకు రూ.280 రూపాయలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వనుంది. త్వరలోనే విద్యుత్ ఛార్జీలను పెంచనుంది. 
 
విద్యుత్ టారిఫ్ కేటగిరీలో మార్పులు చేయడం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులపై ఏకంగా తొమ్మిది వందల కోట్ల భారాన్ని మోపనుంది. అవి అమలయితే గరిష్టంగా రెండు వందల లోపు యూనిట్ల విద్యుత్ను వాడుకునే మధ్యతరగతి వినియోగదారులపైనే ఎక్కువ భారం పడుతుంది.
 
ప్రభుత్వం రాయితీలు పెంచకపోతే వీరు ప్రతి నెలకు ఏకంగా ప్రతి నెలకు ఏకంగా రెండు వందల 80 రూపాయల వరకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. 
 
విద్యుత్ చార్జీలు పెంచఉన్నట్లు ఎక్కడా ప్రస్తావించకుండా హేతుబద్ధీకరణ పేరుతో కేటగిరీలను తగ్గించడం ద్వారా యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయాన్ని వినియోగదారుల నుంచి డిస్కంలు రాబట్టాలని భావిస్తున్నాయి.