సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (16:38 IST)

బాహుబలి బ్యూటీ మనోహరికి కరోనా: క్వారంటైన్‌లో నోరా ఫతేహి

Nora Fatehi
బాహుబలి- ది బిగినింగ్ సినిమాలో 'మనోహరి' పాటకు చిందులేసిన నటి నోరా ఫతేహిని కరోనా కబళించింది. కెనడా భామ అయిన నోరా ఫతేహి 'టెంపర్' 'కిక్‌2', 'లోఫర్', 'ఊపిరి' సినిమాల్లో ఐటమ్ నంబర్స్‌కు డ్యాన్స్‌లు వేసింది. 
 
ఇటు తెలుగులో చేస్తూనే అటూ హిందీలో కూడా ఇరగదీస్తోంది. సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో కనిపించింది. ఇటీవల విడుదలైన త్రీడీ మూవీ, 'స్ట్రీట్ డ్యాన్సర్‌'లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఇప్పుడు కరోనా టైమ్‌లో కూడా ఫొటోషూట్లు చేస్తూ బిజీగా ఉంటోంది. కరోనా టైమ్‌లోనూ వయ్యారాలను ఒలకపోసే ఫోటోలను నెట్టింట వైరల్ చేసేది. 
 
ఈ నేపథ్యంలో నోరా ఫతేహి మంగళవారం కోవిడ్-19 కు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో వుంది. ఆమె ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న చిత్రాలు పాతవని, ఆమె ఇటీవల బయటకు రాలేదు అని స్పష్టం చేశారు.
 
ప్రోటోకాల్స్‌కు కట్టుబడి, నోరా అప్పటి నుండి వైద్యుడి పరిశీలనలో వుంది. నోరా చివరిసారిగా భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కనిపించింది. ఇందులో అజయ్ దేవ్ గన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ తదితరులు కూడా నటించారు.