శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (11:38 IST)

వారంలో ఏడు రెట్లు కరోనా కేసులు : లెవల్-2 ఆంక్షల దిశగా ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ మహమ్మారి మరోమారు కబళించేలా కనిపిస్తోంది. గత వారం రోజుల్లోనే ఏకంగా కోవిడ్ పాజిటివ్ కేసులు ఏకంగా ఏడు శాతం మేరకు మెరిగాయి. దీంతో ఢిల్లీ లెవల్-1 ఆంక్షలను దాటి లెవల్-2 ఆంక్షల దిశగా పయనిస్తుంది. ఒక్క బుధవారమే ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 1.29 శాతం పెరిగింది. దీంతో కొత్త సంవత్సర వేడుకలతో పాటు.. సంక్రాంతికి కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే, తదుపరి ఆంక్షలపై కొన్ని రోజులు వేచిచూసే ధోరణిని అవలంభినుంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం ఇక్కడ 125 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 923కు చేరాయి. అంటే కేసుల పాజిటివిటీ రేటు 0.50 శాతం దాటడంతో లెవల్-1 ఆంక్షలను విధించారు. అంటే ఎల్లో అలెర్ట్‌ను జారీచేశారు. 
 
ఎల్లో అలెర్ట్‌ ఆంక్షల్లో భాగంగా, బహిరంగ సమావేశాలు, సభల నిర్వహణను పూర్తిగా నిషేధించారు. రాత్రిపూట కర్ఫ్యూను అమల్లోకి తెచ్చారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న థియేటర్లు, పబ్‌లు, జిమ్‌లు, క్లబ్‌లు వంటివాటిని మూసివేయించారు. 
 
అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కేసుల పాజిటివిటీ రేటు 1.29 శాతానికి చేరుకుంది. అయితే, కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఫలితంగా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగానే వున్నాయి. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని లెవల్-2 (ఆరెంజ్ అలెర్ట్) ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు.