కోడి కత్తి డ్రామా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు: రఘరామ రాజు
వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ జరిగిందని తెలిసిందని, చాలా దురదృష్టమని, దీనిపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా జరిగితే అందుకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆన్నారు.
రాధా ఇంటి వద్ద రెక్కీపై పారదర్శకమైన విచారణ జరిపించాలన్నారు. కోడి కత్తి కథలా వంగవీటి రాధాపై ఏదో కుట్ర పన్ని, ఆ నిందను ఇతరుల మీదకు నెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు జగన్ తన కోడి కత్తి డ్రామా తెలివి తేటలు ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సీపీఎస్ రద్దును పక్కదారి పట్టించేందుకే, తెరపైకి సినిమా సమస్య తీసుకువచ్చారని విమర్శించారు.
హీరో సిద్దార్ధ్‌కి ఏపీతో సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని అంటున్నారని, మరి జస్టిస్ చంద్రు, కనగరాజుకు ఏపీతో పనేంటని ప్రజలంటున్నారన్నారు. జగన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీం కోర్టుకు వెళ్తానని రఘురామ స్పష్టం చేశారు.