1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (16:30 IST)

పూణేలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

పూణె నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదివే 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువగా లక్షణాలు లేనివారు, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని సంస్థ అనుబంధంగా ఉన్న ఎమ్‌ఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రశాంత్ డేవ్ చెప్పారు. కరోనాను అడ్డుకునేందుకు తాము కఠినమైన చర్యలను అనుసరిస్తున్నామని.. గేటు వద్ద తమ విద్యార్థులకు స్క్రీమింగ్ చేస్తామని డేవ్ తెలిపారు. 
 
అలా ఒక విద్యార్థికి జలుబు లక్షణాలు వుండటంతో తిరిగి ఇంటికి పంపడం జరిగిందని..  ఆ విద్యార్థి తల్లిదండ్రులు అతనికి RT-PCR పరీక్ష చేయమని అడిగారని ప్రశాంత్ డేవ్ అన్నారు. విద్యార్థికి చేసిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత అతడి సన్నిహితులను గుర్తించామని తెలిపారు. ఇప్పటివరకు, 13 మంది విద్యార్థులకు పాజిటివ్ అని తేలినట్లు ఆయన వెల్లడించారు.