1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (16:17 IST)

పూణెలో 13 మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు కరోనా

మహారాష్ట్రలో ఒకవైపు ఒమిక్రాన్‌తో పాటు కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా పూణెలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు కోవిడ్ వైరస్ సోకింది. ఈ విద్యార్థులంతా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే, కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ లక్షణాలు లేనివారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక వైద్యాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం వైద్య పరీక్షలు చేస్తున్నాం. విద్యార్థులకు ప్రధాన గేట్ వద్దే ఈ పరీక్షలు చేస్తున్నాం. స్క్రీనింగ్ సమయంలో ఒక విద్యార్థి తీవ్ర జలుబుతో బాధపడుతున్నట్టు గుర్తించాం. అతనికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అతనికి పాజిటివ్‌గా తేలిందన్నారు.