శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (08:14 IST)

మార్కెట్‌లో కోవిడ్ మాత్రలు - రూ.1,399 మాత్రమే...

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కొంత ఊరటనిచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇకపై దగ్గు, జలుబు, జ్వారానికి మెడికల్ షాపుల్లో మాత్రలను కొనుగోలు చేసినట్టుగానే కోవిడ్ మాత్రలను కూడా కొనుగోలు చేయొచ్చు. 
 
అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుఫిరవిర్ మాత్రలు ఇపుడు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. 'మోలు లైఫ్ (200 ఎంజీ) పేరుతో వచ్చిన ఈ మాత్రలు మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సివుంటుంది. ధర రూ.1,399 మాత్రమే. 
 
ఒక్క అట్టపెట్టెలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్క పూటకు 800 ఎంజీ డోసు కలిగిన మాత్రలను మింగాల్సివుంటుంది. అయితే, ఈ మాత్రలను వైద్యుల సిఫార్సుతోనే వాడాల్సివుంటుంది. 
 
కరోనాకు మాత్రలు అందుబాటులోకి రావడం మన దేశంలో మాత్రం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ మాత్రలను భారత ఫార్మా కంపెనీలు అయిన హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 పార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి.