దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ - ఇప్పటివరకు 1,892 కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 766 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూసినట్టు చెప్పారు. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు నమోదైవున్నాయి.
ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 382ర, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, తమిళనాడులో 121, తెలంగాణాలో 67, కర్నాటకలో 64, హర్యానాలో 63, ఒరిస్సాలో 37, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 20 కేసుల చొప్పున నమోదైనట్టు కేంద్ర తెలిపింది.