1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (09:33 IST)

బిగ్ రిలీఫ్ : ఒమిక్రాన్ చికిత్సకు ఆరోగ్య బీమా వర్తింపు

సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాపించింది. అలాగే, భారత్‌లోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్ఖ (ఐఆర్‌డీఏఐ) శుభవార్త చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని వెల్లడించింది. 
 
అలాగే, సాధారణ ఆరోగ్య బీమా సంస్థలు జారీచేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.
 
అయితే, ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అనేక మంది ఈ వైరస్ బారిపడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారికి ఆస్పత్రుల్లో చేసిన ఖర్చులు కూడా కరోనా ఆరోగ్య బీమా పాలసీలో కవరేజీ అవుతాయని చెప్పారు.