సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 డిశెంబరు 2021 (22:23 IST)

2022లో భారతదేశపు గృహ రియల్‌ ఎస్టేట్‌ పునరుద్ధరణలో అత్యంత కీలకం కానున్న ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌

భారతదేశపు రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ పునరుద్ధరణ పరంగా 2022 సంవత్సరంలో భారీ నగరాలైన ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు నేతృత్వం వహించనున్నాయి. గత 15 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువగా గృహ ఋణ వడ్డీ రేట్లు ఉండటం, ధరల పరంగా నిలకడ వంటి కారణాలు దీనికి తోడ్పడతాయని భారతదేశపు సుప్రసిద్ధ ఫుల్‌ స్టాక్‌ రియల్‌ ఎస్టేట్‌ వేదిక హౌసింగ్‌ డాట్‌ కామ్‌ వెల్లడించింది.

 
హౌసింగ్‌ డాట్‌ కామ్‌ యొక్క ఐరీస్‌ ఇండెక్స్‌ వెల్లడించే దాని ప్రకారం, కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తరువాత ఈ మూడు నగరాలలో గృహ కొనుగోలు కార్యక్రమాలు  ఊపందుకుంటే, టియర్‌ 2 నగరాలైన  సూరత్‌, జైపూర్‌, పాట్నాలలో అత్యధిక  సంఖ్యలో ఆన్‌లైన్‌లో గృహాల కోసం వెదకడం 2021లో కనిపించింది. ఈ ఇండెక్స్‌లో ‘రెసిడెన్షియల్‌ డిమాండ్‌ వృద్ధి చెందేందుకు అవకాశమున్న నగరాల జాబితా’ను సైతం అందించింది. ఈ నగరాలలో టియర్‌ 2 నగరాలైన సూరత్‌ , జైపూర్‌, పాట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరు ఉన్నాయి.

 
హౌసింగ్‌ డాట్‌ కామ్‌ యొక్క ఐరీస్‌ ఇండెక్స్‌ ప్రధానంగా అత్యధిక ఆసక్తి కలిగిన గృహ కొనుగోలుదారుల ఆన్‌లైన్‌ ప్రోపర్టీ సెర్చ్‌ వాల్యూమ్‌ను పరిశీలిస్తుంది. భారతదేశంలో అత్యంత కీలకమైన 42 నగరాలలో రెసిడెన్షియల్‌ డిమాండ్‌ వృద్ధి సూచికగా ఈ ఇండెక్స్‌ నిలుస్తుంది.


‘‘గృహ రియాల్టీకి సంబంధించి ఈ సంవత్సరం ఖచ్చితంగా సానుకూల సంవత్సరంగానే నిలుస్తుంది. అంతేకాదు, 2022 కోసం మొత్తంమ్మీద అనుకూల వాతావరణం సృష్టించింది. ప్రభుత్వం మొదలు రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల వరకూ, బ్యాంకుల నుంచి ప్రోపర్టీ ఇన్వెస్టర్ల వరకూ ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అంశమిది. రియల్‌  ఎస్టేట్‌ రంగంలో  కనిపిస్తోన్న  వృద్ధి 2022 క్యాలెండర్‌ సంవత్సరంలో కూడా కొనసాగుతుందని, ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇండియా సమర్థవంతంగా ఎదుర్కోగలదని  నమ్ముతున్నాం’’ అని ధృవ్‌ అగర్వాల, గ్రూప్‌ సీఈఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌, ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

 
‘‘మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు 2022లో రెసిడెన్షియల్‌ డిమాండ్‌ను పునరుద్ధరించనున్నాయి.  దీనితో పాటుగా టియర్‌ 2 నగరాలైన సూరత్‌, పాట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరులలో సైతం డిమాండ్‌ను చూస్తున్నాము. గృహ కొనుగోలుదారులు ఇప్పుడు భారీ గృహాలను కోరుకుంటున్నారు మరియు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు, భద్రతను సైతం కోరుకుంటున్నారు. రెసిడెన్షియల్‌ రియాల్టీలో  మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు తో పాటుగా సరఫరా మరియు డిమాండ్‌ వాల్యూ చైన్‌ వ్యాప్తంగా డిజిటల్‌ చొరబాటు 2022లో మార్కెట్‌కు ఓ ఆకృతిని అందించగలదు’’ అని అంకిత సూద్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.

 
భారీ గృహాలు, గృహ ప్లాట్స్‌కు అధికంగా డిమాండ్‌ ఉంది
గుర్‌గావ్‌ కేంద్రంగా కలిగిన ఈ కంపెనీ విడుదల చేసిన ఇండెక్స్‌ ప్రకారం, 2022లో గృహ కొనుగోలుదారుల నడుమ భారీ గృహాలకు డిమాండ్‌ అధికంగా ఉండనుంది. దీనికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాల కారణంగా రిమోట్‌ వర్కింగ్‌ విధానాలు కొనసాగడం ఓ  కారణం కావొచ్చు. 2021లో విడుదలైన సమాచారం ప్రకారం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ 15% వృద్ధి 3 బీహెచ్‌కె అపార్ట్‌మెంట్లకు కనిపిస్తుంది.

 
మహమ్మారి అనంతర ప్రపంచంలో భారీ గృహాలకు డిమాండ్‌  పెరగడం చేత ప్లాట్స్‌కు సైతం డిమాండ్‌ గణనీయంగా వృద్ధి చెందవచ్చు. ఐరీస్‌ ఇండెక్స్‌ వెల్లడించే దాని ప్రకారం 2021లో ప్లాట్స్‌కు 42% ఇయర్‌ఆన్‌ ఇయర్‌ డిమాండ్‌ ఉంది. ఆన్‌లైన్‌ సెర్చ్‌లు తెలుపుతున్న దాని ప్రకారం 2 కోట్ల రూపాయలకు పైబడిన విలువ కలిగిన ప్రోపర్టీలకు డిమాండ్‌ 1.1 రెట్లు పెరిగింది.