గురువారం, 23 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2025 (16:56 IST)

Raviteja : పాటకు రిథమ్ లేదు, అర్థంలేదు.. మౌత్ టాకే... సూపర్ డూపర్‌ అంటున్న మాస్ జాతర

Super Duper song on Ravi Teja, Srileela
Super Duper song on Ravi Teja, Srileela
మాస్ మహరాజా రవితేజ ఏమి చేసినా సూటవుతుంది. మాస్ జాతరలో నేడు సూపర్ డూపర్ సాంగ్ విడుదలచేసింది చిత్ర యూనిట్ రవితేజ, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ సాంగ్ లో సాహిత్యం సరికొత్తగా అనిపిస్తుంది. ఈ పాటకు రిథమ్ లేదు, అర్థంలేదు.. మౌత్ టాకే... సూపర్ డూపర్‌ అంటూ సాగిన పాట అలరించేలా వుంది.
 
మునుపటి మాస్ మహారాజా రవితేజను గుర్తుచేసేలా, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే స్వాగ్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలీల తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ మాస్ గీతాన్ని ప్రేక్షకులు మెచ్చే నిజమైన వేడుకలా మలిచాయి.
 
ఈ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ ని మెప్పించడంతో పాటు, అందరినీ కాలు కదిపేలా చేసేలా ఎంతో హుషారుగా ఈ గీతముంది. భీమ్స్ సిసిరోలియోతో కలిసి రోహిణి సోరట్ ఆలపించడం ఈ పాటకు మరింత హుషారుని తీసుకొని వచ్చింది. గీత రచయిత సురేష్ గంగుల అందరూ పాడుకునేలా ఉల్లాసభరితమైన సాహిత్యాన్ని అందించి ఆకట్టుకున్నారు. సంగీతం, గానం, సాహిత్యం అన్నీ చక్కగా కుదిరి.. సూపర్ డూపర్ ను ఓ గొప్ప మాస్ గీతంగా తీర్చిదిద్దాయి.
 
రచయితగా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలకు విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన నాలుగో గీతం సూపర్ డూపర్, సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతోంది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. కొద్దిరోజులుగా ప్రత్యేక ఇంటర్వ్యూలతో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా త్వరలో రానుంది. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.