గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 డిశెంబరు 2021 (10:19 IST)

వీధి కుక్కలకు ఆహారం వేసేందుకు బయటకొచ్చిన మహిళ: ప్రైవేట్ పార్ట్ చూపించిన పోలీసు

బెంగళూరులో ఓ పోలీసు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వీధి కుక్కలకు ఆహారం వేసేందుకు బయటకు వచ్చిన మహిళకు తన ప్రైవేట్ పార్ట్ చూపించాడు. మహిళకు అలా చూపించినందుకు సస్పెండ్ అయినట్లు పోలీసు అధికారి మంగళవారం తెలిపారు.

 
బెంగళూరు ఈశాన్య డివిజన్ డీసీపీ, సి.కె. బాబా అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి చంద్రశేఖర్ ఇంటికి వెళ్తుండగా యలహంక న్యూ టౌన్ హౌసింగ్ బోర్డు సమీపంలో బైక్ ఆపి మూత్ర విసర్జన చేశాడు.

 
ఆ సమయంలో వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు బయటకు వచ్చిన ఓ మహిళకు తన ప్రైవేట్ పార్ట్‌లను చూపిస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికులు దీనిని చిత్రీకరించి బెంగళూరు పోలీస్ కమిషనర్ సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. ఐపిసి సెక్షన్లు 354 (ఎ), 509 కింద యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుపై కేసు నమోదు చేశారు.