Prabhas: డార్లింగ్ ప్రభాస్ తొలి క్రష్ ఎవరో తెలుసా?
సినీ నటుడు ప్రభాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి క్రష్‌పై నోరు విప్పారు. యువతుల డ్రీమ్ హీరోగా, డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్‌కు అనుష్క మధ్య ప్రేమాయణం నడిచిందని పుకార్లు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలేనని.. తాము మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ప్రభాస్ తన తొలి క్రష్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఎల్‌కేజీలోనే ప్రభాస్‌కు టీచర్‌పై క్రష్ వుండేదని.. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తన హైట్ కారణంగా చాలామంది అమ్మాయిలు ఎగాదిగా చూసేవారని ప్రభాస్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఎవరిపైనా తనకు క్రష్, ప్రేమ ఏర్పడలేదని వెల్లడించారు.
ఇకపోతే, ప్రభాస్ 45వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫౌజీ, స్పిరిట్, ది రాజా సాబ్ సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి. ఇంకా ఈశ్వర్, సలార్ సినిమాలు రీ-రిలీజ్ కానున్నాయి.