1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (13:38 IST)

త‌న అందాన్ని చూడ‌మంటున్న దిశా పటానీ

Disha Patani
న‌టి దిశా పటానీ త‌న అందాన్ని చూడండి అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది. నిత్యం సౌంద‌ర్యంగా వుండాలంటే క‌స‌ర‌త్తు, స్విమ్మింగ్ అవ‌స‌రం అని గ‌తంలోనే వెల్ల‌డించింది. అయితే తాజాగా ఇప్ప‌టికే త‌న ప్రియుడుగా వార్త‌ల్లో కెక్కిన నటుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి బీచ్ డెస్టినేషన్‌లో విహారయాత్ర చేస్తోంది. 
 
మంగళవారం, తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను తన అద్భుతమైన ఫోటోతో అప్‌డేట్ చేసింది. ఫోటోలో దిశా పటానీ యూత్‌ను ఆక‌ర్షించేలా పోజులివ్వడాన్ని చూడవచ్చు.  అంతులేని సముద్రం, నారింజ రంగు ఆకాశం. అందులో బికినీలో చాలా అందంగా కనిపిస్తోంది. కింద క్యాప్షన్‌లో ఏమీ వ్రాయలేదు మేఘాల వెనుక సూర్యునితో ఉన్న తన ఫోటోతో పాటు వచ్చింది. 
 
Disha Patani, Tiger Shroff
కాగా, ఇదేరోజు అంటే మంగళవారం ఉదయం, టైగర్ ష్రాఫ్ కూడా నీటిలో నుండి బయటకు వచ్చి బీచ్ వైపు నడుస్తున్న వీడియోను షేర్ చేశాడు. దూరంగా వున్న దిశాని చూస్తున్న‌ట్లుగా వుంది. ఇద్ద‌రూ క‌లిసి ఒకేచోట వున్నారేమోకానీ ఫొటోలు మాత్రం విడివిడిగా ఒకేసారి పోస్ట్ చేయ‌డం నెటిజ‌న్ల‌కు ఆస‌క్తి క‌లిగించింది.