గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (11:32 IST)

దిశా పటానీపై మనసుపడిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ భామ దిశా పటానీపై మనసుపడ్డారు. తాను నటించే తొలి బాలీవుడ్ ప్రాజెక్టులో ఆమెను ఎంపిక చేయాల్సిందిగా సిఫార్సు చేసినట్టు సమాచారం. 
 
నిజానికి ఇటీవలి కాలంలో పలు తెలుగు చిత్రాలు హిందీలో రీమేక్‌ అవుతున్నాయి. ఆ కోవలోనే ప్రభాస్‌ కథానాయకుడిగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఛత్రపతి". ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో హిందీలోకి రీమేక్ చేస్తున్నారు.
 
ఈ సినిమాలో కథానాయికగా దిశాపటానీ దాదాపుగా ఖాయమైనట్టే అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. జాన్వీ కపూర్‌తోపాటు పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, ఆ అవకాశం దిశా పటానీ సొంతమైనట్టు సమాచారం. 
 
దిశా హిందీతోపాటు, తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. పూరి దర్శకత్వం వహించిన ‘లోఫర్‌’ సినిమాతో ఆమె తెలుగులో సందడి చేసిన విషయం తెలిసిందే.