బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:26 IST)

ప్రియుడిని హత్య చేస్తావా? నీతో పడక పంచుకుంటా..?

ప్రేమ, ఆప్యాయతలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను దారుణంగా హత్య చేయించింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ కాంట్రాక్ట్‌ కిల్లర్‌తో డీల్ కుదుర్చుకుంది. హత్య జరిగిన తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్ డబ్బులు చెల్లించడంతో పాటుగా అతడితో పడక పంచుకుంటానని చెప్పింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. చందు మహాపూర్ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్లైంది. అయితే అతడు 20 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చందును కోరింది. అందుకు చందు నిరాకరించాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుని.. అతడిని చంపేందుకు భరత్ గుర్జర్ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో డీల్ కుదుర్చుకుంది. హత్య చేసిన తర్వాత అతడికి రూ. 1.50 లక్షలు ఇస్తానని చెప్పింది. అలాగే అతడితో కలిసి పడక పంచుకుంటానని హామీ ఇచ్చింది.
 
ఈ క్రమంలోనే భరత్.. చందును ఫిబ్రవరి 25న హత్య చేశాడు. చందు హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడు భరత్‌ను గుర్తించారు. భరత్ యువతి నుంచి డబ్బులు, సెక్స్ పొందకముందే స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ హత్యకు ప్రణాళిక రచించిన యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.