సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:53 IST)

'సన్నాఫ్ ఇండియా‌'లో మోహన్ బాబు సరసన మీనా?

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సన్నాఫ్ ఇండియా. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 
 
ఇలాంటి కంటెంట్ ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో రాలేదని చిత్రబృందం వెల్లడించింది. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు వినిపిస్తుంది. ఇందులో మోహన్ బాబు సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటించనున్నట్లుగా సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా "దృశ్యం"లో తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 
 
తాజాగా మలయాళంలో తెరకెక్కిన "దృశ్యం 2" సినిమాతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో మోహన్ బాబు, మీనా కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
అయితే చాలా కాలం తర్వాత మళ్లీ మోహన్ బాబు, మీనా జంటగా రాబోతున్నారు. మీనా కోసం ఈ సినిమా పాత్రను అద్భుతంగా క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నటించిన "అల్లరిమొగుడు" మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత మీనా, మోహన్ బాబు కలయికలో రాబోతున్న సినిమాపై ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.