సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:39 IST)

కలెక్షన్ కింగ్‌కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ... రూ.లక్ష అపరాధం.. ఎందుకు?

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తేరుకోలేని షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం చలాన్ జారీ చేసింది. 
 
ఎటువంటి ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకుగాను ఈ అపరాధం విధిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన అడ్వైర్‌టైజ్‌మెంట్ బోర్డు భవనం ఫ్రంటేజ్‌కు 15 శాతం మించిపోయిందని తెలిపింది.
 
పైగా, ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటివి ఏర్పాటు చేయడం సంబంధిత సెక్షన్ల ప్రకారం నేరమని, కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ఆ చలానాలో పేర్కొంది. దీనిపై మోహన్ బాబు ఇంకా స్పందించలేదు.