శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (15:09 IST)

వర్షాలు రావొద్దని కోరుకున్న మేయర్ ఎవరు?

హైదరాబాద్ నగర ప్రథమ మహిళగా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికార తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె ఈమె. అయితే, ఆమె తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
"ఫస్ట్ నేను దేవుడిని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్ కావడంతో పాటు.. ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశాయి. 
 
గత యేడాది తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో తడిసిముద్దయింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
 
ఈ నేప‌థ్యంలో ఆ విష‌యంపై ఇంట‌ర్వ్యూ చేస్తోన్న జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించ‌గా విజ‌య‌ల‌క్ష్మి ఆ వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు స‌ర్కారుతో పాటు జీహెచ్‌ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నాయ‌న్నారు.
 
అదేసయమంలో ప్రజలు కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. నాలాల ఆక్రమణల వల్లే వ‌ర్షాల‌కు కాలనీలు, ఇళ్లు మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గద్వాల విజయలక్ష్మి కోరారు.