గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (10:45 IST)

కోవిడ్ నుంచి విముక్తి.. రేపు ప్రత్యేక విమానంలో రానున్న గవర్నర్

ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అంతేకాకుండా, ఆయన బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
ఇటీవల ఆయన కోవిడ్ బారినపడిన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరానికి తరలించి ఏజీఐ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కొద్ది రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన విజయవాడకు రానున్నారు. 
 
కాగా, గవర్నర్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి తరలించారు.