గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (13:00 IST)

బీ అలెర్ట్ : దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది ... డాక్టర్ ఎస్.కె. అరోరా

కోవిడ్ వ్యాక్సినేషన్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎస్.కె. అరోరా దేశ ప్రజలకు ఓ హెచ్చరిక చేశారు. దీంతో కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో నమోదవుతున్న కేసుల్లో 75  శాతం మేరకు కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే అని వివరించారు. 
 
 
ఇదే అంశంపై ఆయన మాట్లడుతూ, గత యేడాది డిసెంబరు తొలి వారంలో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించారని, ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోనే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. డిసెంబరు తొలివారం నుంచి చివరి వారం వరకు ఈ వైరస్ కేసుల్లో పెరుగుదల 12 శాతం ఉండగా, ఆ తర్వాత ఈ కేసుల్లో పెరుగుదల ఏకంగా 28 శాతానికి పెరిగాయని ఆయన గుర్తుచేశారు. అందువల్ల దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.