నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నుంచి భారతదేశపు మొదటి ఆటో ఇటిఎఫ్ నిప్పన్ ఇండియా నిఫ్టీ ఆటో ఇటిఎఫ్
నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్‌ఐఎంఎఫ్)కు చెందిన ఎస్సెట్ మేనేజర్ నిప్పాన్‌లైఫ్ ఇండియా ఎస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (నామ్ ఇండియా) ఇప్పుడు నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో మొట్టమొదటి ఆటో రంగంపు ఈటీఎఫ్ ఇది. ఈ ఆటో ఈటీఎఫ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఇది నిఫ్టీ ఆటోఇండెక్స్‌ను ప్రతిబింబించడం /ట్రాకింగ్ చేయడం చేస్తుంది.
ఈ ఎన్‌ఎఫ్‌ఓ 05 జనవరి 2022న తెరువబడుతుంది. 14 జనవరి 2022వతేదీ మూయబడుతుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ కాలంలో కనీస పెట్టుబడి మొత్తం 1000 రూపాయలు. నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ ఎక్కువగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లో ఇండెక్స్‌లో సూచించిన మోతాదులో పెట్టుబడులు పెడుతుంది. ఇది టాప్ 15(నిప్టీ ఆటో ఇండెక్స్ మెథడాలజీ ప్రకారం) కంపెనీలలో అంటే ఆటోమొబైల్ 4వీలర్స్, ఆటోమొబైల్ 2-3 వీలర్స్, ఆటో యాన్సిలియర్స్ మరియు టైర్ల కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. దీనిని నిఫ్టీ ఆటో టీఆర్‌ఐకు బెంచ్‌మార్క్ చేశారు.
ఈ ఆవిష్కరణ గురించి హెమన్ భాటియా, హెడ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ మాట్లాడుతూ,
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పరిశ్రమలో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా ఉంది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, వైవిధ్యమైన ఈటీఎఫ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. మా ఈటీఎఫ్ ఆఫరింగ్స్‌లో మరో నూతన జోడింపుగా నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ నిలుస్తుంది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే 15 స్టాక్స్ ద్వారా భారతదేశపు ఆటో రంగ వృద్థి కథలో భాగం అవుతుంది అని అన్నారు.
భారతదేశంలో అతిపెద్ద ఈటీఎఫ్ ప్లేయర్లలో ఒకటి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (ఎన్‌ఐఎంఎఫ్). నవంబర్ 30,2021 నాటికి సంస్థ ఏయుఎం 5 బిలియన్ రూపాయలు. ఈక్విటీలు, డెబ్ట్స్, కమొడిటీ వ్యాప్తంగా 23 ఈటీఎఫ్‌లు కలిగి ఉంది. నవంబర్ 30,2021 నాటికి ఎన్‌ఐఎంఎఫ్ మార్కెట్ వాటా 60%గా ఉంది.