1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 ఆగస్టు 2021 (23:35 IST)

2860 కోట్ల రూపాయలను సమీకరించిన నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌

నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (ఎన్‌ఐఎంఎఫ్‌)కు చెందిన ఎస్సెట్‌ మేనేజర్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇండియా ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (నామ్‌ ఇండియా) విజయవంతంగా నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓను పూర్తిచేసింది.
 
ఈ ఫండ్‌ మొత్తంమ్మీద 2860 కోట్ల రూపాయలను సమీకరించింది. తద్వారా ఇటీవలి కాలంలో అతిపెద్ద ఎన్‌ఎఫ్‌ఓగా నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అంటే దాదాపు 60%కు పైగా భారతీయ నగరాలను చేరుకున్న అత్యంత విజయవంతమైన ఎన్‌ఎఫ్‌ఓగా ఇది నిలిచింది.
 
నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ అనేది ఓపెన్‌ ఎండెడ్‌ డైనమిక్‌ ఈక్విటీ స్కీమ్‌. భారీ, మధ్య మరియు చిన్న తరహా క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. అనిశ్చితి కాలంలో లార్జ్‌ క్యాప్స్‌లో పెట్టుబడుల కేటాయింపులను వృద్ధి చేయడంతో పాటుగా అదే సమయంలో  మార్కెట్‌ సానుకూల పరిస్థితిలలో  మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ నుంచి కూడా ప్రయోజనం పొందుతుంది.
 
నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ ఈడీ మరియు సీఈవో సందీప్‌ సిక్కా మాట్లాడుతూ, ‘‘మా పట్ల అచంచల విశ్వాసంచూపిన 2.52 లక్షల మంది మదుపరులకు ధన్యవాదములు తెలుపుతున్నాం. వారు 2860 కోట్ల రూపాయలను ఇటీవల ముగిసిన నిప్పాన్‌ ఇండియా ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టారు. గత 15 నెలల్లో  చేరిన 15 లక్షల మంది నూతన పెట్టుబడిదారులకు ఇది అదనం. ప్రస్తుతం మా మదుపరుల సంఖ్య 75 లక్షలకు చేరింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ మా బలీయమైన పంపిణీ సామర్థ్యం ప్రదర్శించడంతో పాటుగా మా బ్రాండ్‌ పట్ల మదుపరులు  చూపుతున్న నమ్మకం, మా డిజిటల్‌ మౌలిక వసతులను ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘మా ఇన్వెస్టర్‌  ఫస్ట్‌ ఫిలాసఫీ కింద మా డిజిటల్‌ ప్రొపర్టీలపై మేము ఆధారపడుతున్నాము. మా వ్యాపారంలో 50% వీటి నుంచి వస్తున్నాయి..’’ అని అన్నారు.