శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (15:20 IST)

మంట పుట్టిస్తున్న గ్యాస్ ధరలు.. సిలిండర్‌పై రూ.25 పెంపు

ఓ వైపు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా అన్నింటిపై ప్రభావం చూపుతుండగా.. మరోవైపు గ్యాస్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లపై మోత తప్పట్లేదు. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలెండర్‌పై మరో రూ. 25 పెంచినట్టు ప్రకటించాయి. 
 
దీంతో.. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సిలెండర్‌పై ఏకంగా రూ. 80.50 మేర పెరిగిపోయింది. సబ్సిడీయేతర సిలిండర్‌పై ఈ భారం పడనుంది. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ. 859.5కు చేరుకుంది. ఇక, ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.859.5కు పెరిగింది. 
 
కోల్‌కతాలో రూ. 886కి పెరగగా.. చెన్నైలో రూ. 875.50కి చేరింది.. లక్నోలో రూ .897.5 కాగా.. అహ్మదాబాద్‌లో రూ. 866.50కు పెరిగింది.. ఇక హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు 25 రూపాయలు పెరగడంతో రూ.912కి చేరింది.