1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (10:41 IST)

వంటగ్యాస్‌ ధరల పెంపు: సబ్సీడీ సిలిండర్‌పై రూ.25ల పెంపు

చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్‌ ధరలను పెంచాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అములులోకి వస్తాయని స్పష్టం చేశాయి. పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్‌ ధర రూ.834.50కు చేరింది. మరో వైపు 19 కిలోల సిలిండర్‌పై సైతం రూ.76 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1550కు చేరువైంది. 
 
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు ఇవాళ సవరించాయి. ప్రతి ఐదురోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సవరిస్తాయి. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.122కు చమురు కంపెనీలు తగ్గించాయి. 
 
దీంతో 19 కిలో సిలిండర్ రూ.1473.50కు తగ్గింది. అయితే, సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి. చివరి సారిగా మార్చిలో ధరలు పైకి కదిలాయి.