1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (11:28 IST)

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు

చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌ పై రూ. 35 పైసలు పెంచిన కంపెనీలు.. , డీజిల్‌పై రూ. 37 పైసలు పెంచాయి. నేడు (ఆదివారం) మరో పెట్రోల్, డీజల్‌పై వరుసగా రూ.36 పైసలు, రూ.26 పైసల మేర పెంచాయి. పెంచిన రేట్లతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్ రూ.98.47 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.91కి చేరింది. 
 
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.102.32కి చేరగా, డీజిల్‌ ధర రూ.96.90లు పెరిగింది. 55 రోజుల్లో పెట్రోల్‌పై లీటరు కు రూ.8.07 పెరగగా, డీజిల్‌పై రూ.8.38 పెంచాయి చమురు కంపెనీలు. మే 4 నుంచి నేటి వరకు దాదాపు 31 సార్లు ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.100కు చేరుకుంది. అలాగే డీజిల్‌ కూడా రూ.100 కు చేరువలో ఉంది.