1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

పెరిగిసిన పసిడి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?

దేశంలో బంగారం ధరలు మరోమారు పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఈ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొక రోజు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు ఈ ధరలు తగ్గాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. 
 
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. 
 
గురువారంనాటి ధరల ప్రకారం దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.300 వరకు పెరుగగా, కొన్ని ప్రాంతాల్లో నిలకడగా ఉంది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉంది. 
 
ఇకపోతే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది.