జేమిసన్ నిప్పులు... భారత్ బెంబేలు... ఆటను మార్చేసిన రిజర్వ్ డే
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ పై 32 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 101/2తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, ఆఖర్లో జేమీసన్ (21), సౌథీ (30) ధాటిగా ఆడడంతో కివీస్ జట్టు భారత తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ 3 వికెట్లు సాధించాడు. అశ్విన్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.
ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ఆరంభంలోనే భారత్ కీలకమైన కోహ్లీ వికెట్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ కేవలం 13 పరుగులకే నిష్క్రమించాడు. కైల్ జేమిసన్ మరో సారి తన బౌలింగ్ లైన్‌తో కోహ్లీని ఇబ్బందిపెట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని జేమిసన్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ స్టంప్ అవతల లూజ్ షాట్ ఆడిన కోహ్లీ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో ఇండియా తన రెండవ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 72 రన్స్ చేసింది. పుజారా, రహానేలు క్రీజ్‌లో ఉన్నారు.
ముఖ్యంగా రిజర్వే డే ఆటను పూర్తిగా మార్చేసింది. దీంతో భారత్ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో హడలెత్తించిన కైల్ జెమిసన్ మళ్లీ విజృంభిస్తున్నాడు.
రెండవ ఇన్నింగ్స్‌లోనూ తన బౌలింగ్‌తో ఇండియాపై అటాక్ చేస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభంలో కెప్టెన్ కోహ్లీ, పుజారా వికెట్లను జెమిసన్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇండియా తీవ్ర కష్టాల్లో పడింది. అతి స్వల్ప స్కోర్లకే పుజారా, కోహ్లీలు నిష్క్రమించారు. కోహ్లీ 13, పుజారా 15 రన్స్ చేసి ఔటయ్యారు. కీలక వికెట్లు తీసిన కివీస్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.