గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (21:39 IST)

డబ్ల్యూటీసీ పైనల్‌: అర్థ శతకాన్ని చేజార్చుకున్న విలియమ్సన్

డబ్ల్యూటీసీ పైనల్‌లో భారత్ తన సత్తా చాటుతోంది. కివీస్‌కు చుక్కలు చూపిస్తోంది. షమీ తన బంతులకు పదును పెడుతూ కివీస్ వికెట్లను నేలకూలుస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతున్నాడు. 162 పరుగుల వద్ద కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌ (13)ను పెవిలియన్ పంపడం ద్వారా షమీ తన ఖాతాలో మూడో వికెట్‌ను వేసుకున్నాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ విలియమ్సన్ భారత బౌర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 
 
అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తృటిలో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఇప్పటివరకు కివీస్ జట్టు 94 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టీమ్ సౌథి(10), వెగ్నర్(0)లు ఉన్నారు.