గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (15:41 IST)

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ : ఐదో రోజూ అంతేనా...

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌రుణుడి అడ్డుతొల‌డం లేదు. ఇంగ్లండ్‌లోని సౌతాంప్ట‌న్‌లో ఇంకా వ‌ర్షం కురుస్తోంది. దీంతో ఐదో రోజు ఆట కూడా ఇంకా ప్రారంభంకాలేదు. ఆల‌స్యంగా మ్యాచ్ ప్రారంభం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది. 
 
అయితే, ఇప్ప‌టికే వ‌ర్షం వ‌ల్ల రెండు రోజుల ఆట‌ను కోల్పోయారు. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 217కు ఆలౌటైంది. కివీస్ రెండు వికెట్లు కోల్పోయి 101 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే. రిజ‌ర్వ్ డే ఉన్నా.. మ్యాచ్ మాత్రం డ్రా అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
దీంతో ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగే వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ తొలి టైటిల్ పోటీలు తీవ్ర నిరుత్సాహానికి గురిచేసినట్టే. ఈ టైటిల్ పోరులో రసవత్తరంగా సాగుతుందని భావించినప్పటికీ.. వర్షం కారణంగా తీవ్ర విఘాతం కలిగింది.