శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (15:52 IST)

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ : నాలుగో రోజు ఆటకు అడ్డుపడిన వరుణ్

అందరూ ఊహించినట్టే వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ నాలుగో రోజు ఆట‌కు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. సోమ‌వారం ఉద‌యం నుంచి సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎజియ‌స్ బౌల్ స్టేడియం మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. 
 
నాలుగో రోజు ఆట ప్రారంభం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. సోమ‌వారం రోజంతా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో ఆట స‌జావుగా సాగ‌డం అనుమానమే.
 
అంతకుముందు... సౌతాంఫ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం లభించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (30), డెవాన్ కాన్వే (38) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. 
 
ఈ జోడీని చివరికి అశ్విన్ విడదీశాడు. లాథమ్‌ను అశ్విన్ అవుట్ చేయడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. కొత్తబంతితో బుమ్రా, ఇషాంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మహ్మద్ షమీ కివీస్ ఓపెనర్లను ఇబ్బందిపెట్టినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. 
 
కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు న్యూజిలాండ్ ఇంకా 147 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.