మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:16 IST)

స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేయనున్న BIHER

భారతదేశంలోని ప్రముఖ పరిశోధన మరియు విద్యాసంస్థలలో, అత్యంత పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లుతోంది భారత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (BIHER). ఇప్పుడు ఈ సంస్థ… హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అనుబంధ సంస్థలైనటువంటి బ్రిగమ్‌ మరియు ఉమెన్స్‌ హాస్పిటల్స్‌ వారితో కాన్ఫిడెన్షియల్‌ డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ (CCDA)ను కుదుర్చుకుంది.
 
ఈ అగ్రిమెంట్‌ ద్వారా ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం 5 మిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోంది. దీనిద్వారా కేర్ డయాగ్నోస్టిక్స్ మరియు మొబైల్/టెక్ ఎనేబుల్డ్ డయాగ్నొస్టిక్ పరికరాల విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ మరియు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది.
 
ఈ సందర్భంగా వైస్‌ ఛాన్స్‌లర్‌ కేవీ భాస్కర్‌ రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… ఈ డెవలప్‌మెంట్‌పై మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే బెస్ట్‌ అయినటువంటి వారితో కలిసి పనిచేయడం చాలా మంచి పరిణామం. దీనివల్ల రాబోయే రోజుల్లో విద్యార్థుల మార్పిడి, జాయింట్‌ రీసెర్చ్‌ మరియు జాయింట్‌ గ్రాంట్స్‌ పొందడానికి, అలాగే మరెన్నో అద్భుతమైన అన్వేషణలకు మార్గం సుగమం అవుతుంది అని అన్నారు.
 
BIHER మరియు BWH మధ్య కుదిరిన అగ్రిమెంట్‌ ద్వారా పాయింట్ ఆఫ్ కేర్, మొబైల్ ఆధారిత డయాగ్నోస్టిక్స్‌ సేవలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసెర్చ్‌లో అందించేందుకు, అలాగే సంయక్తంగా అభివృద్ధి చేసేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి రీసెర్చ్‌ సెంటర్ల వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మేల్‌ ఇన్‌ఫెర్టిలిటీ, ఓవులేషన్‌, క్యాన్సర్‌… అలాగే కోవిడ్‌ 19 సమయంలో ఎక్కువగా ఎదుర్కున్న వైరల్‌ లోడ్స్‌పై కూడా మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలు కలుగుతుంది.
 
"ఇది రెండు వేర్వేరు విభాగాలైన ఇంజినీరింగ్‌ మరియు మెడిసిన్‌ను ఏకం చేయడం ద్వారా బయోమెడికల్‌ అప్లికేషన్‌ మరియు 3D విభాగాల్లో పరిశోధన మరియు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ నుండి ప్రోఫెసర్‌ వీసీ రీసెర్చ్‌ డాక్టర్ సురేష్.
 
ఈ సందర్భంగా BIHER ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ ఆనంద్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… "స్టేట్‌ ఆఫ్‌ ద ఆర్ట్‌ ఫెసిలిటీ సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు, అందుకు తగ్గ పెట్టుబడిని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. దీనివల్ల మా BIHER విద్యార్థులు మరియు అధ్యాపకులు ప్రపంచంలో అత్యుత్తమంగా పని చేయడానికి మరియు ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు.
 
తమిళనాడులోని పురాతన ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లలో అన్నింటికంటే ముందు ఉంటుంది భారత్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (BIHER). ఇటీవలే భారతదేశంలో ఎస్సీఇమాగో సంస్థల ర్యాంకింగ్స్ 2021 '(SIR-2021)  నిర్వహించిన సర్వేలో నెం .1 ప్రైవేట్ యూనివర్సిటీగా గెలుపొందింది. అలాగే దేశవ్యాప్తంగా పరిశోధన విభాగంలో 2021 ఏడాదిలో అన్ని ప్రముఖ ప్రభుత్వ సంస్థలను అధిగమించి 1 వ ర్యాంక్ పొందింది. ఈ ర్యాంకింగ్‌లు BIHER  సంస్థ యొక్క వేగవంతమైన ఆధునికీకరణ మరియు విద్యా బోధన, అత్యాధునిక పరిశోధన మరియు గ్రౌండ్ బ్రేకింగ్ కమ్యూనిటీ సేవా కార్యకలాపాలకు నిదర్శనం.
 
బ్రిగమ్‌ మరియు ఉమెన్స్‌ హాస్పిటల్స్‌ (BWH) శతాబ్దాల క్రితం ఏర్పాటు చేయబడ్డ హార్వర్డ్ మెడికల్ కాలేజీలో అంతర్భాగం. అంతేకాదు హార్వర్డ్ మెడికల్ స్కూల్ యొక్క రెండో అతిపెద్ద టీచింగ్ హాస్పిటల్ మరియు మసాచుసెట్స్‌-బోస్టన్‌లోని లాంగ్‌వుడ్ మెడికల్ ఏరియాలో అతిపెద్ద హాస్పిటల్‌గా అదనపు పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంది. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌తో పాటు, మసాచుసెట్స్‌లో అతిపెద్ద హెల్త్‌కేర్‌ ప్రొవైడర్‌గా ఉన్న మాస్‌ జనరల్‌ బ్రిగమ్‌ యొక్క వ్యవస్థాపక సంస్థల్లో BWH కూడా ఒకటి.