హమ్మయ్య....కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. దీనికి తోడు గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయల వరకు ఉండటంతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గృహిణుల వంట గ్యాస్ ధరలపై మండిపడుతున్నారు.
ఈ దశలో దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ₹102.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. సవరించిన ధర ఈరోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. దీంతో 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర ₹1,998.50కు చేరింది. చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంతో రెస్టారెంట్‌లు, టీస్టాల్స్తో పాటు వాణిజ్య సిలిండర్ను వినియోగించే వారికి కొంత మేర ఉపశమనం కలగనుంది.