శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (09:43 IST)

కొత్త సంవత్సరంలో భారీగా తగ్గిన బంగారం ధరలు

వారం రోజుల క్రితం వరకు తారాస్థాయికి చేరిన బంగారం ధరలు కొత్త సంవత్సరంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఈ పసిడి ధరలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అందుకే పిసిడి ప్రియులు ఇపుడే బంగారం ధరలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. 
 
ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 10 గ్రామాలు 22 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల వ్యవధిలో రూ.390 వరకు తగ్గింది. అలాగే, ఈ  వారం మొదట్లో రూ.49590 ఉండగా, ఈ వారాంతానికి వచ్చేసమయానికి ఇది రూ.49200కు చేరుకుంది. 
 
అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వారం ఆరంభంలో రూ.45450గా ఉండగా, వారాంతానికి ఇది రూ.45100కు చేరకుంది. అలాగే, వెడి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. గత వారం రోజుల్లో వెండి ధరలో రూ.600కు మేరకు తగ్గింది.