బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (10:40 IST)

దేశంలో భారీగా పెరిగిన కేసులు.. మరణాలు - వైరస్‌తో 534 మంది మృతి

దేశంలో కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 58,097 కేసులు నమోదైనాయి. వైరస్‌తో 534 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 
 
అలాగే దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,43,21,803 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ ధాటికి మొత్తంగా 4,82,551 మంది మరణించారు. దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.