శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (14:49 IST)

హడలెత్తిస్తున్న కరోనా వైరస్ : కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం

దేశంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్‌లు హడలెత్తిస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, పలు ఆంక్షలు విధిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీనికి నిదర్శనం మంగళవారం దేశ వ్యాప్తంగా 37 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడమే నిదర్శనం. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్క రోజులేనే 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా కఠిన చర్యలకు ఉపక్రమించింది. 
 
ప్రధానంగా కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రులు లేదా గృహాల్లో ఐసోలేషన్‌లో ఉండే సమయాన్ని 10 నుంచి ఏడు రోజులకు కుదించింది. వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే ఏడు రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొంది. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.18 శాతంగా ఉంది. మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.