శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (17:42 IST)

సాహో నటుడు అరుణ్ విజయ్‌కి కరోనా పాజిటివ్

Arun Vijay
నటీనటులు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, అర్జున్, వడివేలు, మంచు మనోజ్, కరీనా కపూర్, నోరా ఫతేహి తదితర నటులకు కరోనా సోకింది. తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడు చేరాడు. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. బ్రూస్‌లీ, సాహో సినిమాలతో ఇతడు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ చిత్ర పరిశ్రమలో వరుసగా నటులు కోవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
తాజాగా అరుణ్ విజయ్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''అందరికీ నమస్కారం!! నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  వైద్యుల సలహా మేరకు నేను హోం క్వారంటైన్ లో ఉన్నా. అన్ని ప్రోటోకాల్స్ అనుసరిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి''’అంటూ ట్వీట్ చేశాడు అరుణ్. 
 
రోజురోజుకు దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. కొత్తగా 495 కేసులు వెలుగుఛూశాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది.