మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (18:36 IST)

ఆంధ్రప్రదేశ్‌లో రెట్టింపవుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపవుతున్నాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం ఈ కేసుల సంఖ్య డబుల్ అయింది. అంటే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో 434 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో ఒక్క కరోనా రోగి కూడా ప్రాణాలు కోల్పోలేదు. 
 
ఇదిలావుంటే, 24 గంటల్లో 102 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 20,75,481కు చేరింది. వీరిలో 20,59,134 మంది కోలుకోగా, 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1848 యాక్టివ్ కేసులు ఉన్నాయి.