బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (14:41 IST)

ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు... 28కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం మధ్యాహ్నానికి మరో నాలుగు కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. 
 
తాజాగా వెలుగుచూసిన ఈ నాలుగు కేసుల్లో అమెరికా నుంచి వచ్చిన ఒక్కరికీ, బ్రిటన్ నుంచి మరో ఇద్దరికి, మరో దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ నలుగురులో ఒకరి మహిళ ఉన్నారు. 
 
మరోవైపు, ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ మేరకు ఒమిక్రాన్ వైరస్ బారినపడినవారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. ఇదిలావుంటే మంగళవారం ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెల్సిందే. అలాగే, కరోనా పాజిటివ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.