అమెరికాలో కరోనా విజృంభణ: ఒక్కరోజే అమెరికాలో 10లక్షల కేసులు
అమెరికా కరోనా విజృంభించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యూఎస్‌లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా రోజువారీ కోవిడ్ కేసుల్లో అమెరికా ప్రపంచ రికార్డు సృష్టించింది.
సోమవారం ఒక్కరోజే అమెరికాలో 10లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే నాలుగు రోజుల క్రితం యూఎస్‌లో 5లక్షల 90వేల కేసులు ఒక్కరోజులో నమోదైనాయి. నూతన సంవత్సర వేడుకలు, వరుస సెలవులే అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణమని అఅధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, కోవిడ్ కేసుల పెరుగుదలతో అమెరికాలో హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది హాస్పిటల్ పాలవ్వగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో హాస్పిటల్స్‌లో చేరికలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో లక్ష మందికి పైగా హాస్పిటల్స్‌లో కోవిడ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక,కోవిడ్ సునామీ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.