తెలంగాణాలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఇందులోభాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు మంజూరుఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీచేశారు. అన్ని విద్యా సంస్థలకు మొత్తం తొమ్మిది రోజులు సెలవులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై ఆయన సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీచేశారు. అదేసమయంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చూడాలని ఆయన అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.