ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (09:41 IST)

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
తనకు కోవిడ్ సోకినట్టు వెల్లడించారు. జ్వరం, దగ్గుతో కూడిన స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించగా, కోవిడ్ నిర్దారణ అయినట్టు తెలిపారు. అదేసమయంలో తనను కాంటాక్ట్ అయిన వారు విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.