Mohan Babu: మోహన్ బాబును చంద్రబాబు మోసం చేశాడా ? ఎందుకంటే...!
డా. మోహన్ బాబు ఈమధ్య కుటుంబ వ్యవహారాల్లో ప్రచారం అయ్యారు. ఇద్దరు కొడుకుల మధ్య జరిగే అంతర్లీన యుద్ధంలో ఎవరినీ సపోర్ట్ చేయాలో తెలీక సతమతమవుతున్నారు. అలాంటి టైంలో మంచు మనోజ్ కు సినిమా ద్వారా సక్సెస్ వచ్చింది. ఇక తాజాగా మోహన్ బాబు చాలా కాలం తర్వాత నాని సినిమా ది పేరడైజ్ లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. గిరిజన హక్కుల కోసం పోరాడే నాయకుడిగా నాని నటిస్తున్నాడు. మరి మోహన్ బాబు పాత్ర ఏమిటనేది సస్పెన్స్.
కాగా, ఇటీవలే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో అవతవకలపై రాజకీయ పార్టీలవారు అల్లరి చేయడం వారిని అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి పరిణామంలో మోహన్ బాబుతో ఓ దర్శకుడు చేస్తున్న ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.
మోహన్ బాబు ను ఓ దర్శకుడు చేస్తున్న ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి ఆయన మాట్లాడిన మాటలు నెటిజన్లను ఆలోజింపజేశాయి. మోహన్ బాబు మాటల్లో... రాజకీయంగా కానీ, మనసులో నన్ను గాయపరిచింది చంద్రబాబే. హెరిటేజ్ ఫ్రూట్ నాది. నా సంస్థ. నా డబ్బు ఎక్కువ. షేర్ ఎక్కువ. అలాంటి దాన్ని లాగేసుకున్నాడు.
డా. రాజశేఖర్ రెడ్డిగారు పాద యాత్ర చేస్తున్నప్పుడు ఓసారి ఆయన ఇంటికి ఆహ్వానించారు. టిఫిన్ కు వెళ్ళాను. అప్పుడు ఆయన అడిగారు. ఏం మోహన్ బాబు మీరు చంద్రబాబు స్నేహితులు గదా. ఎందుకు మీ మధ్య గొడవ అన్నారు. సార్.. మోహన్ బాబు అనేవాడిని రాజశేఖర్ రెడ్డిగారికి పరిచయం చేసింది చంద్రబాబే. అన్నపూర్ణ హోటల్ లోనే కలిశాం. అలాంటిది నా హెరిటేజ్ విషయంలో జరిగిన మోసం గురించి విషయాలు మొత్తం చెప్పాను.
అప్పుడు ఆయన ఏమన్నారటే. ఏమయ్యా..చంద్రబాబు వాళ్ళ మామయ్యనే వెన్ను పటు పొడిచాడు. ఆఫ్టరాల్ నీకు చేయడంలో తప్పేముంది. అన్నారు. ఈ వీడియో బైట్ సోషల్ మీడియాలో రన్ అవుతుంది. మరి మోహన్ బాబు ఈ విషయాన్ని ఇంతవరకే పరిమితం చేస్తారా... ది పారడైజ్ సినిమాలో అంశాన్ని చూపిస్తాడా? అనేది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వెయిట్ అండ్ సీ..