శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (09:19 IST)

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సిమెంట్ ధరలు

సామాన్యులపై ఇప్పటికే సిలిండర్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా సిమెంట్ ధరలు కూడా పెరిగిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలను పెంచుతున్నట్టు సిమెంట్ డీలర్లు చెప్తున్నారు. 
 
ప్రతి 50కిలోల సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి 30 వరకు ధరలు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో 50 కిలో గ్రాముల బస్తా రూ. 300 నుంచి రూ. 350 వరకు ఉంటుందని సిమెంట్ డీలర్లు తెలిపారు. 
 
సిమెంట్ ధరను పెంచిన కంపెనీల్లో పెన్నా సిమెంట్స్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, శ్రీసిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, రామ్ కో సిమెంట్స్ ఉన్నాయి. అయితే కొత్త ఏడాదిలో సిమెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటుందని అందుకే సిమెంట్ ధరలు పెంచినట్టు డీలర్లు తెలిపారు.