గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (12:54 IST)

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త - జగనన్న కిట్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదవే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందజేస్తారు. 
 
ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే.. వేసవి సెలవుల్లోనే ఈ కిట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలుజారీచేసింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించింది.