శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (19:16 IST)

ఏపీలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - కొత్తగా 334

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 334 కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క రోగి మృత్యువాతపడ్డారు. 
 
మంగళవారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శాఖ వెల్లడించిన బులిటెన్ మేరకు... కొత్తగా నమోదైన 334 పాజిటివ్ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,942కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 14,499కు పెరిగింది. 
 
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1516 యాక్టివ్ కేసులు ఉండగా వీరంతా ఆయా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 95మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 20,61,927కు చేరుకుంది.