బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (17:09 IST)

మీరూ ఒక నిర్మాతే... మీరు ముందుంటే మేము వెనకుంటాం.. సి.కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధరలను తగ్గించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. నిర్మాతలంతా ఐక్యంగా ఉండి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సమస్యను పరిష్కరించుకుందామని సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిర్మాత సి.కళ్యాణ్ ఖండించారు. నిర్మాతల్లో ఐక్యత లేదనడం సరికాదన్నారు. మోహన్ బాబు కూడా ఓ నిర్మాతేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పైగా, మోహన్ బాబు ముందుంటే మేము మీ వెనుకుంటామని కళ్యాణ్ అన్నారు. 
 
ఇదే అంశంపై కళ్యాణ్ మంగళవారం మాట్లాడుతూ, అన్ని సమస్యలపై ప్రభుత్వలో నిర్మాతల మండలి చర్చిస్తూనే ఉందన్నార. నిర్మాతల్లో ఐక్యత లేదనడం సబబు కాదన్నారు. మోహన్ బాబు మాత్రమే కాదు ఆయన కుమారుడు కూడా ఓ నిర్మాతేనని గుర్తుచేశారు. మీ కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉందని చెప్పారు. తమ వల్ల సమస్య పరిష్కారం కాదని మోహన్ బాబు భావిస్తే, ఆయనే ముందుంటే ఆయన వెంట మేమంతా కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు సి.కళ్యాణ్ అన్నారు.