సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (13:07 IST)

సినీ పెద్దరికం హోదా అక్కర్లేదు : చిరంజీవి

తెలుగు చిత్రపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు ఏమాత్రం ఇష్టంలేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం సినీ కార్మికులకు ఆరోగ్య కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
"గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎవరు లేరు. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారని మాకు ధైర్యం ఉంటుంది" అని చిరంజీని సినీ కార్మికులు కోరారు. 
 
దీనికి చిరంజీవి స్పందిస్తూ, పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదన్నారు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకస్సలు వద్దు. కానీ బాధ్యతల గల సినీ బిడ్డగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటా. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాను. అవసరం వచ్చినపుడు తప్పకుండా ముందుకువస్తాను. అనవసరమైన విషయాలకు ముందుకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
ముఖ్యంగా, ఎవరైన ఇద్దరు వ్యక్తులు లేదా రెండు యూనియన్లు సభ్యులు గొడవ పడితే ఆ సమస్యను పరిష్కరించాలని తన వద్ద పంచాయతీ పెడితే వేలుపెట్టే ప్రసక్తే లేదన్నారు. కానీ, కార్మికులకు ఆరోగ్య ఉపాధి సమస్యలు వచ్చినపుడు మాత్రం తప్పకుండా సమగ్ర విశ్లేషణ చేసి వారి కోసం అండగా నిలబడతానని చెప్పారు.