శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:35 IST)

శానా క‌ష్టం అంటోన్న ఆచార్య‌

Megastar Chiranjeevi dance
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న కొత్త చిత్రం `ఆచార్య‌`. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఆయ‌న స‌ర‌న న‌టించింది. రామ్‌చ‌ర‌ణ్‌, పూజా మ‌రో కాంబినేష‌న్‌. తాజాగా ఈ సినిమా గురించి అప్ డేట్ డిసెంబ‌ర్ 31న విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ తో 2022ని ప్రారంభిద్దాం అంటూ ట్వీట్ చేసింది. శానా క‌ష్టం అనే లిరికల్ వీడియోను జనవరి 3న సాయంత్రం 4:05 గంటలకు విడుద‌ల చేస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందులో మెగాస్టార్ స్టెప్లు చూడాల్సిందే. కూడిపూడి డాన్స్ త‌ర‌హాలో ముద్ర‌లు వేస్తూ విడుద‌ల చేసిన స్టిల్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.
 
ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట‌లు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఒక్కో స‌మ‌యంలో ఒక్కో స్టిల్‌ను అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇక కొత్త ఏడాదిలో ప్ర‌చారాన్ని మ‌రింత ముందుకు తీసుకు వెళుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ మేట్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్, కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ తెలియ‌జేస్తున్నాయి.